Uddhav Thackeray: గవర్నర్ కోటా నుంచి థాకరేను ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలని కేబినెట్ నిర్ణయం!
- ఉభయ సభల్లో సభ్యుడు కాని ఉద్ధవ్ థాకరే
- గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ
- ఒక సీటును థాకరేకు ఇవ్వాలని కేబినెట్ విన్నపం
గవర్నర్ కోటా నుంచి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను ఎమ్మెల్సీ గా నామినేట్ చేయాలని మహారాష్ట్ర కేబినెట్ రెకమెండ్ చేసింది. థాకరే ఉభయ సభల్లో కూడా సభ్యుడు కాదన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మహారాష్ట్ర శాసనమండలిలో గవర్నర్ కోటాలో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి.
ఈ సందర్భంగా మంత్రి అనిల్ పరబ్ మాట్లాడుతూ, ఈ రెండు సీట్లలో ఒక సీటు నుంచి థాకరేను ఎంపిక చేయాలని గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీని కోరుతున్నామని చెప్పారు. కాగా, ఈ అంశం తన గురించే కావడంతో కేబినేట్ సమావేశానికి ముఖ్యమంత్రి థాకరే హాజరు కాలేదు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఈ సమావేశానికి నాయకత్వం వహించారు.