Bihar: ఒకే ఒక్కడు... బీహార్ లో నమోదైన కరోనా కేసుల్లో మూడో వంతుకు కారకుడు!

Nearly A Third Of Bihars corona Cases From One person

  • ఒమన్ నుంచి తిరిగొచ్చిన బాధితుడు
  • కుటుంబంలోని 22 మందికి సోకిన వైరస్
  • 43 గ్రామాలు పూర్తిగా నిర్బంధం

బీహార్ లో ఇప్పటి వరకు దాదాపు 60 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో మూడో వంతు కేసులు ఒకే  కుటుంబానికి చెందినవి కావడం కలకలం రేపుతోంది. రాష్ట్ర రాజధాని పాట్నాకు 130 కిలోమీటర్ల దూరంలో సివాన్ జిల్లాలో ఈ కేసులు నమోదయ్యాయి. ఈ చైన్ ఒమన్ నుంచి తిరిగొచ్చిన ఒక వ్యక్తి నుంచి ప్రారంభమైంది.

మార్చి 16న సదరు వ్యక్తి  భారత్ కు తిరిగి వచ్చాడు. ఏప్రిల్ 4న ఇతనికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈలోగా ఆయన జిల్లాలోని పలు ప్రాంతాల్లో తిరిగాడు. ఈ క్రమంలో ఆయన నుంచి కుటుంబంలోని మరో 22 మందికి వైరస్ సోకింది. వీరందరికి కరోనా పాజిటివ్ అని తేలింది. వీరిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. గ్రామంలోని మరో ఇద్దరు కూడా దీని బారిన పడ్డారు.

సదరు వ్యక్తి కుటుంబంలోని నలుగురు కరోనా నుంచి కోలుకున్నారు. అయినా వారిని మరో రెండు వారాల పాటు క్వారంటైన్ లోనే ఉంచుతామని అధికారులు చెప్పారు. మరోవైపు ఈ ప్రాంతంలోని 43 గ్రామాలను అధికారులు పూర్తిగా నిర్బంధించారు.

  • Loading...

More Telugu News