Punjab: లాక్ డౌన్ ను మే 1 వరకు పొడిగించిన పంజాబ్
- దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు
- పంజాబ్ లో 132 మందికి కరోనా పాజిటివ్
- ఇప్పటివరకు 8 మంది మృతి
కరోనా రక్కసిని ఎదుర్కోవడంలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతోంది. అయినప్పటికీ కరోనా కేసులు పెరుగుతుండడం అనేక రాష్ట్రాలను ఆందోళనకు గురిచేస్తోంది. వాస్తవానికి కేంద్రం విధించిన 21 రోజుల లాక్ డౌన్ ఈ నెల 14తో పూర్తవుతుంది. పాజిటివ్ కేసులు పెరుగుతుండడం, మరణాలు సంభవిస్తుండడంతో లాక్ డౌన్ పొడిగించాలని రాష్ట్రాలే కేంద్రాన్ని కోరుతున్నాయి. ఇప్పటికే ఒడిశాలో ఈ నెల 30 వరకు లాక్ డౌన్ పొడిగించగా, తాజాగా పంజాబ్ లోనూ లాక్ డౌన్ ను మరికొంతకాలం కొనసాగించాలని నిర్ణయించారు. మే 1వ తేదీ వరకు పంజాబ్ లో కర్ఫ్యూ అమల్లో ఉంటుందని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. పంజాబ్ లో ఇప్పటివరకు 132 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 8 మంది చనిపోయారు. నలుగురు కోలుకున్నారు.