Siphonophore: హిందూ మహాసముద్రంలో వింత ఆకారం... గుర్తించిన అమెరికా సైంటిస్టులు

very long stringy thing floating in indian ocean surprises scientists

  • 150 అడుగుల పొడవైన తీగలాంటి విచిత్ర రూపం
  • 'అపోలెమియా'గా పేర్కొన్న శాస్త్రవేత్తలు
  • నీటిపై తేలియాడుతుండగా డ్రోన్ కెమెరా చిత్రీకరణ

అమెరికా పరిశోధకులు హిందూ మహాసముద్రంలో నమ్మశక్యం కాని రీతిలో ఓ విచిత్ర ఆకారాన్ని గుర్తించారు. ఓ పొడవైన తీగ వంటి శరీరంతో సుమారు 150 అడుగుల వరకు ఉన్న ఈ భారీ రూపాన్ని ఇప్పటివరకు ఎవరూ చూడలేదు. హిందూ మహాసముద్రంలోని 'నింగాలూ కాన్యన్' ప్రాంతంలో ఇది నీటిపై తేలియాడుతుండగా అమెరికాకు చెందిన 'ష్మిట్ ఓషన్ ఇన్ స్టిట్యూట్' పరిశోధకుల డ్రోన్ కెమెరాకు చిక్కింది. శాస్త్రవేత్తలు దీన్ని 'సైఫనోఫోర్' వర్గానికి చెందని 'అపోలెమియా'గా పేర్కొన్నారు. అంతేకాదు నీటిపై తేలియాడే కాలనీగా అభివర్ణించారు.

ఇవి జెల్లీఫిష్, కోరల్స్ వర్గానికి చెందిన జీవులని, సముద్ర గర్భంలో బాగా లోతైన ప్రాంతాల్లో సంచరిస్తుంటాయని ఈ పరిశోధనలో పాలుపంచుకున్న మెరైన్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ కార్లీ వీనర్ తెలిపారు. వాస్తవానికి 'సైఫనోఫోర్' జీవులు చాలా చిన్నవని, చూడ్డానికి క్లోనింగ్ చేసిన జీవుల్లా ఒకేలా ఉంటాయని, అన్నీ కలిసి ఒకే దేహంలా పనిచేస్తాయని వివరించారు. వాటిలో కొన్ని ప్రత్యేకించి ఆహారం అందించడం, కొన్ని ప్రత్యుత్పత్తి చేయడం, మరికొన్ని ఈదడం వంటి పనులకే పరిమితమవుతాయని పరిశోధకులు వెల్లడించారు. అయితే ఇంత భారీగా ఎప్పుడూ, ఎక్కడా కనిపించలేదని అంటున్నారు.

  • Loading...

More Telugu News