Andhra Pradesh: వాట్సాప్, ఫేస్ బుక్ లో సోషల్ మీడియా హెల్ప్ డెస్క్ లను ప్రారంభించిన ఏపీ సర్కారు
- కరోనా సమాచారం అందించేందుకు ఆన్ లైన్ సహాయ కేంద్రాలు
- చాట్ బోట్ సాయంతో తాజా సమాచారం
- ఫేస్ బుక్ కు కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సర్కారు
కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్రజలకు విస్తృత స్థాయిలో సమాచారం అందించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. వాట్సాప్, ఫేస్ బుక్ సామాజిక మాధ్యమాల్లో కరోనా సమాచారం అందించేందుకు ప్రత్యేకంగా ఇంటరాక్టివ్ హెల్ప్ డెస్క్ లను ప్రారంభించింది. ఈ సహాయ కేంద్రాల ద్వారా కరోనా తాజా సమాచారంతో పాటు అప్ డేట్లను కూడా అందుకోవచ్చు. ఈ ఆన్ లైన్ సహాయ కేంద్రాల్లో ఓ చాట్ బోట్ ప్రజల సందేహాలకు బదులిస్తుంది. దీనిపై ఏపీ ప్రభుత్వం ఫేస్ బుక్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపింది. స్వచ్ఛందంగా ముందుకొచ్చి చాట్ బోట్ కు రూపకల్పన చేశారంటూ అభినందించింది.