reservebank: మారటోరియం ఆదేశాలను పట్టించుకోని బ్యాంకులు : యథావిధిగా ఈఎంఐల కోత

EMI maratorium not honered by banks

  • ఆర్‌బీఐ స్పష్టంగా చెప్పినా తీరుమార్చుకోని బ్యాంకర్లు
  • ఆటో డెబిట్‌ సిస్టం ద్వారా నిధులు డ్రా
  • కట్టని వారికి జరిమానాలు విధించినట్టు మెసేజ్‌లు

కరోనా కష్టకాలం, లాక్‌డౌన్‌ ఇబ్బందుల నేపథ్యంలో సగటు మనిషిపై ఆర్థికభారం పడకుండా ఉండేందుకు బ్యాంక్‌ల పెద్దన్న రిజర్వ్‌బ్యాంక్‌ విధించిన మూడు నెలల మారటోరియంను జాతీయ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. పర్సనల్‌, హోం, వాహనం...ఇలా రుణం ఏదైనా మూడు వాయిదాలను కట్టక్కర్లేదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఈ విషయంలో ఖాతాదారుడు స్వచ్ఛందంగా ‘తనకు మారటోరియం అక్కర్లేదు’ అని లిఖితపూర్వకంగా రాసిస్తే తప్ప ఆయా అకౌంట్ల నుంచి డబ్బును కట్‌ చేయవద్దని ఆర్‌బీఐ స్పష్టంగా పేర్కొంది.

కానీ ఒక్క బ్యాంకు దీన్ని అమలు చేసినట్టు కనబడలేదు. ప్రైవేటు బ్యాంకుల సంగతి పక్కన పెడితే కనీసం జాతీయ బ్యాంకులు కూడా ఆర్‌బీఐ ఆదేశాలను పట్టించుకోక పోవడంతో ఖాతాదారులు లబోదిబోమంటున్నారు. ‘ఆర్‌బీఐ ప్రకటించింది కదా అని ఈఎంఐ కోసం ఉంచిన మొత్తం ఇంటి అవసరాలకు వాడుకున్నాం.

తీరా ఇప్పుడు ఈఎంఐ కట్టనందున జరిమానా విధిస్తున్నట్టు, చెక్‌బౌన్స్‌ అయినందున జరిమానా చెల్లించాలంటూ మెసేజ్‌లు వస్తున్నాయి’ అంటూ పలువురు ఖాతాదారులు వాపోతున్నారు. ఇదేంటని అడిగితే కట్‌ అయిన డబ్బు తిరిగి ఇవ్వాలంటే కస్టమర్‌ కేర్‌ను సంప్రదించాలని చెబుతున్నారని, మెయిల్‌ పెట్టాలని అంటున్నారని, పెడితే దానికి సమాధానమే ఉండడం లేదని పలువురు వాపోతున్నారు.

  • Loading...

More Telugu News