Vishnu Vishal: భార్యతో విడాకులు తీసుకున్నాకే గుత్తా జ్వాల పరిచయం అయింది: విష్ణు విశాల్

Vishnu Vishal says Gutta Jwala no cause for his divorce
  • జ్వాల, విష్ణు విశాల్ డేటింగ్
  • త్వరలో పెళ్లి చేసుకోబోతున్న జంట
  • గతంలో తన విడాకులకు జ్వాల కారణం కాదని విష్ణు విశాల్ వెల్లడి
బ్యాడ్మింటన్ ఫైర్ బ్రాండ్ గుత్తా జ్వాల ఇటీవలే తన ప్రేమ విషయాన్ని బయటపెట్టిన సంగతి తెలిసిందే. దక్షిణాది నటుడు విష్ణు విశాల్ తో తాను డేటింగ్ చేస్తున్నానని, త్వరలోనే పెళ్లి చేసుకుంటామని వెల్లడించింది. గుత్తా జ్వాలకు ఇంతక్రితమే బ్యాడ్మింటన్ ఆటగాడు చేతన్ ఆనంద్ తో వివాహం జరగ్గా, కొంతకాలానికి విడాకులు తీసుకున్నారు. అటు విష్ణు విశాల్ సైతం కాస్ట్యూమ్ డిజైనర్ రజనీని పెళ్లాడి, ఆ తర్వాత విడిపోయారు. ఈ విషయంపై విష్ణు విశాల్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.

గుత్తా జ్వాలతో ప్రేమ వ్యవహారం కారణంగానే తన కాపురంలో కలతలు వచ్చాయని ప్రచారం జరిగిందని, వాస్తవానికి రజనీతో విడాకుల తర్వాతే తనకు గుత్తా జ్వాల పరిచయం అయిందని స్పష్టం చేశారు. విడాకుల తర్వాత ఎంతో మానసిక వేదనకు లోనైన సందర్భంలో జ్వాల తన జీవితంలోకి వచ్చిందని వివరించారు. తన దాంపత్య జీవితం విచ్ఛిన్నం కావడానికి జ్వాల ఎంతమాత్రం కారణం కాదని స్పష్టం చేశారు. అంతేకాకుండా, అమలాపాల్ ను కూడా ఈ వివాదంలోకి లాగారని, ఆమె కారణంగానే తన పెళ్లి విడాకుల వరకు వెళ్లిందని ప్రచారం చేశారని విష్ణు విశాల్ ఆవేదన వ్యక్తం చేశారు.
Vishnu Vishal
Gutta Jwala
Dating
Wedding
Divorce

More Telugu News