T Shield: వైద్య సిబ్బంది కోసం ఫేస్ షీల్డు తయారుచేసిన తెలంగాణ మెడ్ టెక్ కంపెనీ
- వినూత్న ఆవిష్కరణ అంటూ కేటీఆర్ ప్రశంసలు
- తక్కువ బరువుతో ఫేస్ షీల్డు తయారీ
- 'టీ షీల్డ్'గా నామకరణం
తెలంగాణలోని ట్రాన్స్ కాత్ మెడికల్ డివైసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే మెడ్ టెక్ కంపెనీ కరోనాపై పోరాటంలో పాలుపంచుకుంటున్న వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది కోసం సరికొత్త ఫేస్ షీల్డు తయారుచేసింది. ఇదొక వినూత్న ఆవిష్కరణ అని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కొనియాడారు. కొవిడ్-19ను ఎదుర్కోవడంలో ముందు నిలిచి సేవలు అందిస్తున్న వైద్య సిబ్బంది కోసం ఈ ఫేస్ షీల్డు ఎంతో ఉపయోగపడుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. కాగా, దీనికి 'టీ షీల్డ్' అని నామకరణం చేశారు. చాలా తక్కువ బరువుతో ముఖాన్నంతా కవర్ చేసేలా దీన్ని రూపొందించారు.