sensex: కరోనా ప్రభావంతో నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- మార్కెట్లపై లాక్ డౌన్ ప్రభావం
- 469 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 105 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని నష్టాలతో ప్రారంభించాయి. కరోనా కేసులు పెరుగుతుండటంతో పాటు లాక్ డౌన్ మరిన్ని రోజులు కొనసాగనున్న నేపథ్యంలో, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీనపడింది. ఈ నేపథ్యంలో, ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 469 పాయింట్లు నష్టపోయి 30,690కి పడిపోయింది. నిఫ్టీ 105 పాయింట్లు కోల్పోయి 9,006కి దిగజారింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎల్ అండ్ టీ (6.36%), భారతి ఎయిర్ టెల్ (4.29% ), అల్ట్రాటెక్ సిమెంట్ (3.50% ), ఇండస్ ఇండ్ బ్యాంక్ (3.17% ), ఎన్టీపీసీ (2.07% ).
టాప్ లూజర్స్:
బజాజ్ ఫైనాన్స్ (-10.06% ), టైటాన్ కంపెనీ (-4.87% ), మహీంద్రా అండ్ మహీంద్రా (-4.84% ), హీరో మోటో కార్ప్ (-3.57% ), ఐసీఐసీఐ బ్యాంక్ (-3.34% ).