Earthquake: ఢిల్లీని వదలని ప్రకంపనలు... ఇవాళ కూడా భూకంపం
- ఈ మధ్యాహ్నం మళ్లీ కంపించిన భూమి
- 2.7 తీవ్రతతో ప్రకంపనలు
- నిన్న 3.5 తీవ్రతతో భూకంపం
- ఇళ్లలోంచి బయటికి పరుగులు తీసిన ప్రజలు
ఢిల్లీలో ఇవాళ కూడా భూమి కంపించింది. ఈ మధ్యాహ్నం 2.7 తీవ్రతతో ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. అంతకుముందు 3.5 తీవ్రతతో ఆదివారం భూకంపం వచ్చింది. ఈ భూకంప కేంద్రం ఉత్తర ఢిల్లీలోని వజీరాబాద్ లో ఉన్నట్టు గుర్తించారు. ఈ ప్రకంపనలతో ప్రజలు ఇళ్లలోంచి బయటికి పరుగులు తీశారు.
ఓవైపు కరోనా ఆందోళనలు, మరోవైపు భూకంప భయాలతో హడలిపోయారు. దేశంలోని ఐదు భూకంప జోన్లలో ఢిల్లీ నాలుగో జోన్ లో ఉంది. భూకంపాలకు కేంద్రంగా నిలవడం ఢిల్లీ చరిత్రలో అరుదైన విషయం. సాధారణంగా మధ్య ఆసియా, హిమాలయ ప్రాంతంలో భూకంపాలు సంభవిస్తే ఢిల్లీలోనూ ప్రకంపనలు వస్తుంటాయి. ఈసారి అందుకు భిన్నంగా ఢిల్లీలోనే భూకంప కేంద్రం ఉన్నట్టు నిపుణులు గుర్తించారు.