AP High Court: ఏపీ ఎస్ఈసీ అంశం.. అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
- ఎస్ఈసీ నియామక నిబంధనలను సవరిస్తూ కొత్త జీవో
- దీనిని సవాల్ చేస్తూ హైకోర్టులో ఆరు పిటిషన్లు దాఖలు
- వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించిన న్యాయస్థానం
ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నియామక నిబంధనలను సవరిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిని సవాల్ చేస్తూ రాష్ట్ర హైకోర్టులో ఆరు పిటిషన్లు దాఖలయ్యాయి. లాక్ డౌన్ నేపథ్యంలో ఆయా కేసుల విచారణను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ నెల 16 నాటికి అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశిస్తూ, ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. కాగా, ప్రభుత్వ కొత్త జీవో ప్రకారం, ఎస్ఈసీ పదవీకాలం ఐదేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గిపోయింది. దాంతో, ఏపీ ఎస్ఈసీ పదవి నుంచి రమేశ్ కుమార్ ను ప్రభుత్వం తప్పించింది.