Telangana: తెలంగాణలో ఏడేళ్ల చిన్నారికి సోకిన కరోనా

Seven year old Boy in Sangareddy infected to Coronavirus
  • సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌కు చెందిన బాలుడు
  • స్విట్జర్లాండ్ వెళ్లొచ్చిన తండ్రి
  • నెగటివ్ అని ఇంటి కొస్తే కుమారుడికి సోకిన వైరస్
తెలంగాణలోని ఏడేళ్ల బాలుడు కరోనా మహమ్మారి బారినపడ్డాడు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌కు చెందిన వ్యక్తి (36) గత నెల 17న స్విట్జర్లాండ్ నుంచి తిరిగొచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత సంస్థకు చెందిన అతిథి గృహంలో 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉన్నాడు. ఆ తర్వాత నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగటివ్ అని తేలడంతో ఇంటికెళ్లాడు. అయితే,  ఈ నెల 5, 6 తేదీల్లో అతడి ఏడేళ్ల కుమారుడు జ్వరం, దగ్గుతో బాధపడుతుండడంతో అనుమానించి పరీక్షలు చేయించగా ఈ నెల 12న కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో చిన్నారితోపాటు, అతడి తండ్రిని కూడా అధికారులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. కుటుంబంలోని మిగతా నలుగురి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. ప్రస్తుతం వారంతా పటాన్‌చెరులోని ఐసోలేషన్ కేంద్రంలో ఉన్నట్టు అధికారులు తెలిపారు.
Telangana
Corona Virus
Ameenpur
Sangareddy District

More Telugu News