Corona Virus: మహారాష్ట్రలో పోలీసు వాహనంపైకి ఎక్కి.. కరోనాపై అవగాహన కల్పించిన ప్రపంచంలోనే అతి పొట్టి మహిళ
- నాగ్‌పూర్‌కు చెందిన జ్యోతి మాటలు ఆసక్తికరంగా విన్న స్థానికులు
- లాక్డౌన్ ముగిసేంత వరకు ఇళ్ల నుంచి బయటకు రావద్దు
- కొవిడ్-19 వ్యాప్తిని అరికట్టాలంటే ప్రభుత్వ సూచనలు పాటించాలి
- పాటిస్తేనే దేశంలో కరోనా మహమ్మారిని ఎదుర్కోగలం
ప్రపంచంలోనే అతి తక్కువ పొడవు ఉన్న మహిళగా గుర్తింపు తెచ్చుకున్న నాగ్‌పూర్‌కు చెందిన జ్యోతి ఆమ్గే (26) లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలకు సందేశం ఇచ్చింది. పోలీసులతో పాటు ఆమె వీధుల్లోకి వచ్చి అన్ని నిబంధనలను పాటించాలని చెప్పింది.
నాగ్‌పూర్‌లో పోలీసుల సహకారంతో ఆమె పోలీసు వాహనంపైకి ఎక్కి ఈ సందేశం ఇచ్చింది. అతి పొట్టిగా ఉన్న ఆమె మాట్లాడుతుంటే అక్కడివారంతా ఆసక్తిగా ఆమె మాటలు విన్నారు. లాక్డౌన్ ముగిసేంత వరకు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, కొవిడ్- 19 వ్యాప్తిని అరికట్టాలంటే ప్రభుత్వ సూచనలు పాటించాలని ఆమె తెలిపింది.
ఇవన్నీ పాటిస్తేనే దేశంలో కరోనా మహమ్మారిని ఎదుర్కోగలమని ఆమె చెప్పింది. కరోనా సోకితే మనకే కాకుండా కుటుంబం మొత్తం సమస్యలను ఎదుర్కొంటుందని ఆమె వివరించింది. కాగా, మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతోన్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో 2000 మందికి పైగా ప్రజలు కరోనా బారిన పడ్డారు.