Lockdown: పేదల ఆకలి తీర్చేందుకు వియత్నాంలో ‘రైస్ ఏటీఎం’లు

Rice ATM feeds Vietnams poor amid lockdown

  • ఉచితంగా  కిలోన్నర బియ్యం అందజేత
  • లాక్‌డౌన్‌తో వియాత్నాంలో ఉపాధి కోల్పోయిన కార్మికులు
  • వారి కోసం రైస్ ఏటీఎంలు ఏర్పాటు చేసిన ఓ వ్యాపారవేత్త

కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచం మొత్తం అల్లాడుతోంది. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు చాలా దేశాలు లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలో చిన్న దేశమైన  వియత్నాం కూడా లాక్ డౌన్ అయిపోయింది.  దీంతో  దినసరి  కూలీలు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అందుకే అలాంటి వాళ్ల ఆకలి తీర్చేందుకు హోచి మిన్ సిటీకి చెందిన హోంగ్ తువాన్ అన్ అనే వ్యాపారి  కొత్త  ప్రయత్నంతో ముందుకొచ్చారు. నగరంలో ఉచితంగా  బియ్యం పంచేందుకు ‘రైస్ ఏటీఎం’లను ఏర్పాటు చేయించారు. ఏటీఎం నుంచి ఒక్కోసారి 1.5 కిలోల బియ్యం వస్తాయి. వియత్నాంలోని హనోయి, హూ, డనాంగ్ అనే నగరాల్లోనూ ఇలాంటి రైస్ ఏటీఎంలను ఏర్పాటు చేశారు. వియత్నాంలో కేవలం 265  కరోనా కేసులే నమోదయ్యాయి. ఇప్పటిదాకా ఒక్కరూ కూడా చనిపోలేదు. అయినా ముందుజాగ్రత్తగా ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది.

  • Loading...

More Telugu News