Byreddy Siddharth Reddy: వైసీపీ నేత బైరెడ్డిపై కేసు నమోదు చేసిన పోలీసులు

Case filed against Byreddy Siddharth Reddy
  • కరోనా విస్తరించకుండా హైపో ద్రావణం స్ప్రే
  • సామాజిక దూరం పాటించని వైనం
  • కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి
కర్నూలు జిల్లా నందికొట్కూరు వైసీపీ ఇన్ఛార్జి బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామిపై కూడా కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే, నియోజకవర్గంలో కరోనా విస్తరించకుండా హైపో ద్రావణాన్ని స్ప్రే చేశారు. ఈ కార్యక్రమంలో బైరెడ్డి, వెంకటస్వామి ఇద్దరూ పాల్గొన్నారు.

అయితే, ద్రావణాన్ని స్ప్రే చేస్తున్న సమయంలో సామాజిక దూరం పాటించకపోవడంతో కేసు నమోదైంది. కేసు నమోదుపై నేతలు ఇద్దరూ ఇంతవరకు స్పందించలేదు. మరోవైపు, రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో హైపో ద్రావణాన్ని స్ప్రే చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజా ప్రతినిధులు, నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జీలు దగ్గరుండి చేయిస్తున్నారు. ఈ సందర్భంగా కొన్ని చోట్ల సోషల్ డిస్టెన్స్ పాటించకపోవడంతో కేసులు నమోదవుతున్నాయి.
Byreddy Siddharth Reddy
YSRCP
Police Case

More Telugu News