CPI Ramakrishna: మోదీ తన ప్రసంగంలో పేదలు, వలస కార్మికుల గురించి ప్రస్తావించలేదు: సీపీఐ రామకృష్ణ

CPI Ramakrishna criticises PM Modi

  • వలస కార్మికులను వారి స్వస్థలాలకు చేర్చాలి 
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి పేదవాడికీ రూ. 5 వేల చొప్పున ఇవ్వాలి
  • రైతులు పంటలు విక్రయించుకునేందుకు అండగా ఉండాలి

భారత్ లో మరి కొన్ని రోజుల పాటు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్టు ఈ రోజు ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రసంగంపై సీపీఐ రామకృష్ణ విమర్శలు చేశారు. లాక్ డౌన్ పొడిగింపు నేపథ్యంలో పేదలు, వలస కార్మికుల గురించి ప్రస్తావించలేదని అన్నారు. వలస కార్మికులను వారి స్వస్థలాలకు చేర్చాలని, ప్రతి పేదవాడి అకౌంట్ లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ. 5 వేల చొప్పున జమ చేయాలని డిమాండ్ చేశారు. రైతులు పంటలు వేసేందుకు, చేతికొచ్చిన పంటను విక్రయించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు.

  • Loading...

More Telugu News