Andhra Pradesh: ఈ ప్రాంతాల్లో నివసించే వారు జాగ్రత్తగా వుండాలి: ఏపీ ప్రభుత్వం

Andhra Pradesh Releases New Corona Positive Cases Location Details

  • 10 నుంచి 13 వరకూ కొత్త కేసుల వివరాలు
  • ఆయా ప్రాంతాలను వెల్లడించిన ప్రభుత్వం
  • ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన

ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 10 నుంచి 13వ తేదీ వరకూ కరోనా పాజిటివ్ వచ్చిన వారు నివాసం ఉన్న ప్రాంతాలను వివరిస్తూ, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ, తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టును ఉంచింది. ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులోని ఇస్లాంపేట, మార్కాపురం, గుంటూరు నగర పరిధిలోని అరండల్ పేట, సంగడి గుంట, కుమ్మరి బజారు, ఆనంద్ పేట, సుజాతా నగర్,  బుచ్చయ్య నగర్, జిల్లా పరిధిలోని దాచేపల్లి, పొన్నూరు, కొరిటపాడు, నరసరావుపేట, ఉరువకట్ట, పెడకన, కర్నూలు జిల్లా ఆత్మకూరు, కర్నూలు పరిధిలోని గనిగల్లు, బనగానపల్లి మండలంలోని హుసేనాపురం, చాగలమర్రి ప్రాంతాల్లో కొత్త కేసులు నమోదయ్యాయని వెల్లడించింది.

వీటితో పాటు వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు, బద్వేలు సమీపంలోని మహబూబ్ నగర్, చిత్తూరు జిల్లా వడమాలపేట, శ్రీకాళహస్తి ప్రాంతాలతో పాటు మద్దూరు పరిధిలోని పాణ్యం గ్రామం, నంద్యాల అర్బన్, నెల్లూరు జిల్లా వాకాడు మండల పరిధిలోని తిరుమూరు, తడ మండలంలోని బీవీ పాలెం,  నెల్లూరు పరిధిలోని నవాబు పేట, కోటమిట్ట, చంద్రబాబు నగర్, రంగనాయకుల పేట, పెద్ద బజారు, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం, కృష్ణా జిల్లా రాణిగారితోట, విజయవాడ పరిధిలోని మాచవరం, అనంతపురం జిల్లా హిందూపూర్ మండల పరిధిలోని గూలకుంటల్లోనూ కొత్త కేసులు వచ్చాయని, ఇక్కడి వారంతా తగు జాగ్రత్తల్లో ఉండాలని సూచించింది.

  • Loading...

More Telugu News