Prashant Kishor: లాక్ డౌన్ పొడిగింపు నిర్ణయాన్ని ప్రశ్నించిన ప్రశాంత్ కిశోర్

Political strategist Prashant Kishore questions lock down extension
  • మే 3 వరకు లాక్ డౌన్ పొడిగించిన కేంద్రం
  • అప్పటికీ సత్ఫలితాలు రాకపోతే ఏంచేస్తారన్న ప్రశాంత్ కిశోర్
  • ప్రత్యామ్నాయం ఏదైనా ఉందా? అంటూ కేంద్రానికి ప్రశ్న
కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా ఇప్పటికే విధించిన లాక్ డౌన్ ను కేంద్రం మరో 19 రోజులు పొడిగించడంపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్పందించారు. రెండో విడత లాక్ డౌన్ హేతుబద్ధత, విధివిధానాలపై అదేపనిగా చర్చించడంలో అర్థంలేదని అభిప్రాయపడ్డారు.

అయితే, మే 3 వరకు మనం ఎంచుకున్న మార్గంలోనే నిలిచినా అనుకున్న ఫలితాలు రాకపోతే ఏం చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారిందని వ్యాఖ్యానించారు. లాక్ డౌన్ పొడిగింపు సత్ఫలితాలు ఇవ్వని పక్షంలో కేంద్రం వద్ద ప్రత్యామ్నాయ ప్రణాళిక ఏదైనా ఉందా? లేక ఇదే సరైన విధానం అంటారా? అని ప్రశ్నించారు.
Prashant Kishor
Lockdown
Extension
India
Corona Virus

More Telugu News