bihar: క్వారంటైన్‌ సెంటర్​ కిటికీకి ఉరివేసుకున్న వ్యక్తి!

  Man who returned home from Delhi found hanging inside quarantine

  • బీహార్లోని దర్బంగ జిల్లాలో ఘటన
  • ఈ నెల 10న ఢిల్లీ నుంచి వచ్చిన ఆ వ్యక్తిని క్వారంటైన్ చేసిన అధికారులు
  • టీబీ, కుటుంబ సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడి

కరోనా వైరస్‌ నుంచి చాలా మంది కోలుకొని ఆసుపత్రుల నుంచి బయపడుతుంటే, క్వారంటైన్ సెంటర్లలో ఉంటున్న కొందరు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా, బీహార్‌‌లోని దర్బంగా జిల్లాకు చెందిన ఒక వ్యక్తి  (43 ఏళ్లు) క్వారంటైన్‌ సెంటర్‌‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నెల 10న ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తిని కుమ్రౌలీలోని ఒక పాఠశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ సెంటర్‌‌కు తరలించారు. కాగా.. సోమవారం రాత్రి రూమ్‌లోని కిటికీకి టవల్‌తో ఉరివేసుకుని చనిపోయాడని పోలీసులు చెప్పారు.

ఆ వ్యక్తి చాలా రోజులుగా టీబీతో బాధపడుతున్నాడు. దాని వల్ల ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోందని వైద్యులు తెలిపారు. టీబీతో పాటు కుటుంబ సమస్యల వల్లే అతను చనిపోయాడని జిల్లా కలెక్టర్‌‌ త్యాగరాజన్‌ చెప్పారు. క్వారంటైన్‌ కేంద్రానికి వచ్చినప్పుడే తనకు టీబీ ఉందని చాలా ఒత్తిడికి గురయ్యాడని తెలిపారు. వైద్యులు అతనికి అవసరమైన ఆహారం, మందులు ఇచ్చారని  చెప్పారు. కాగా, ఈ నెల 11న ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ జిల్లాలో హోం క్వారంటైన్‌లో ఉన్న 21 ఏళ్ల ఓ వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.

  • Loading...

More Telugu News