Tollywood: అల్లు అర్జున్‌తో సందీప్ వంగా సినిమా!

 Allu Arjun to star in Sandeep Reddy Vangas next movie
  • తొలుత రణ్‌బీర్ కపూర్ ఆసక్తి
  • క్రియేటివ్ డిఫరెన్స్‌తో తప్పుకున్న బాలీవుడ్ స్టార్!
  • ప్రస్తుతం ‘పుష్ప’ చిత్రంలో నటిస్తున్న బన్నీ
తన తొలి చిత్రం ‘అర్జున్‌ రెడ్డి’తోనే  విపరీతమైన  క్రేజ్ సంపాదించుకున్న టాలీవుడ్ యువ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తన తదుపరి సినిమా కోసం రెడీ అయ్యారు. అర్జున్ రెడ్డి చిత్రాన్ని ‘కబీర్ సింగ్’ పేరుతో హిందీలో కూడా రీమేక్ చేసి హిట్ కొట్టిన ఆయన తన తదుపరి ప్రాజెక్ట్‌లో హీరో ఎంపిక కోసం కష్టపడుతున్నారు.

తొలుత బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ ఒప్పుకున్నా, ఆ తర్వాత క్రియేటివ్ డిఫరెన్స్‌తో వైదొలిగినట్టు వార్తలు వచ్చాయి. ఆపై, ప్రభాస్, మహేశ్ బాబు పేర్లు కూడా తెరపైకి వచ్చినా అధికారిక ప్రకటన రాలేదు. అయితే, టాలీవుడ్ తాజా సమాచారం మేరకు, అల్లు అర్జున్‌ను సందీప్‌ రెడ్డి సంప్రదించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమాలో నటిస్తున్న బన్నీ.. సందీప్‌కు గ్రీన్‌ సిగ్నల్ ఇస్తాడో లేడో చూడాలి.
Tollywood
Allu Arjun
sandeep reddy vanga
next
movie

More Telugu News