Jagan: క్వారంటైన్ పూర్తి చేసుకుని ఇళ్లకు వెళ్లే వాళ్లకు రూ.2 వేల చొప్పున ఇవ్వండి: సీఎం జగన్ ఆదేశాలు

CM Jagan review meeting on corona virus

  • క్వారంటైన్  ముగిసిన వాళ్లూ తగు జాగ్రత్తలు పాటించాలి
  • ప్రతి వారం పరీక్షలు చేయించుకోవాలి
  • క్వారంటైన్ కేంద్రాల్లో కావాల్సిన సదుపాయాలు కల్పించాలి

‘కరోనా’ అనుమానితులు ఎవరైతే క్వారంటైన్ కేంద్రంలో తమ గడువు పూర్తి చేసుకున్నారో వాళ్లందరికీ రూ.2 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని ఏపీ సీఎం జగన్ ఆదేశించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఇవాళ  ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ పలు నిర్ణయాలు తీసుకున్నారు. క్వారంటైన్ లో చికిత్స పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి వెళ్లే వారికి వాళ్లు పాటించాల్సిన జాగ్రత్తల గురించి చెప్పాలని ఆదేశించారు.

క్వారంటైన్ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లిన వ్యక్తులు ప్రతి వారం పరీక్షలు చేయించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందుతున్న తీరు, పరీక్షల నిర్వహణ, ఇప్పటి వరకు నమోదైన కేసుల వివరాలను జగన్ కు అధికారులు వివరించారు. క్వారంటైన్ కేంద్రాల్లో కావాల్సిన సదుపాయాలు కల్పించాలని, రోజువారి కరోనా పరీక్షల నిర్వహణా సామర్థ్యాన్ని పెంచాలని సూచించారు. దీంతో రోజుకు నాలుగు వేల పరీక్షలు నిర్వహించేలా సామర్థ్యం పెంచుతామని అధికారులు జగన్ కు తెలిపారు.

  • Loading...

More Telugu News