KTR: ‘కరోనా’ ప్రభావిత ప్రాంతంలో కేటీఆర్ ఆకస్మిక పర్యటన

Minister KTR unexpected visit in Red Zone

  • వేములవాడలోని రెడ్ జోన్ లో కేటీఆర్ పర్యటన
  • అక్కడి ప్రజల  సమస్యలపై ఆరా తీసిన వైనం
  • మరో రెండు వారాల పాటు ప్రజలు సహకరించాలని వినతి

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో ‘కరోనా’ ప్రభావిత ప్రాంతం (రెడ్ జోన్)లో మంత్రి కేటీఆర్ ఆకస్మిక పర్యటన చేశారు. అక్కడి ప్రజలను కలిసి సమస్యలపై ఆరా తీశారు. రెడ్ జోన్ లో కూరగాయలు, నిత్యావసరాలు సక్రమంగా అందుతున్నాయో లేదో ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ‘కరోనా’ వ్యాప్తి చెందకుండా పాటించాల్సిన జాగ్రత్తల గురించి వారికి చెప్పారు. మే 3 వరకు ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు.

అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ‘కరోనా’ అదుపులో ఉందని చెప్పారు. ఈ జిల్లాలో కొత్త కేసులు నమోదు కాకుండా అందరూ తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు. పల్లెల్లో ప్రజలు సామాజిక దూరం పాటిస్తున్నారు కానీ, పట్టణాల్లో యువత ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదని అన్నారు. మరో రెండు వారాల పాటు ప్రజలు సహకరిస్తే కరోనా రహిత రాష్ట్రంగా తెలంగాణను ప్రకటించుకోవచ్చని అన్నారు.

  • Loading...

More Telugu News