New Delhi: ఢిల్లీలో హింసను రెచ్చగొట్టే కుట్ర.. జామియా విద్యార్థికి 14 రోజుల కస్టడీ
- సీఏఏకు వ్యతిరేకంగా అల్లర్లు
- అల్లర్లలో ఐబీ అధికారి సహా 53 మంది మృతి
- 9 రోజుల కస్టడీ ముగియడంతో కోర్టులో హాజరు పరిచిన పోలీసులు
ఈశాన్య ఢిల్లీలో హింసను రెచ్చగొట్టేందుకు కుట్ర పన్నిన ఆరోపణలపై అరెస్ట్ అయిన జామియా మిలియా ఇస్లామియా (జేఎంఐ) విద్యార్థికి ఢిల్లీ కోర్టు రెండు వారాల జుడీషియల్ కస్టడీ విధించింది. ఈ ఏడాది ఢిల్లీలో జరిగిన హింసాకాండలో ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి అంకిత్‌శర్మతోపాటు ఓ హెడ్ కానిస్టేబుల్ కూడా ప్రాణాలు కోల్పోయారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఈ అల్లర్లలో 53 మంది మృతి చెందారు. హింసను ప్రోత్సహించాడంటూ జేఎంఐ విద్యార్థిని 9 రోజుల క్రితం అరెస్ట్ చేసిన పోలీసులు, తాజాగా అతడి కస్టడీ గడువు ముగియడంతో ఈ రోజు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రోహిత్ గులియా ఎదుట హాజరుపరిచారు. విచారించిన కోర్టు అతడిని 14 రోజుల జుడీషియల్ కస్టడీకి అప్పగించింది.