Dubhai: స్మార్ట్‌ హెల్మెట్‌: పెట్టుకుంటే కరోనా వైరస్‌ బాధితులను పట్టేస్తుంది!

smart helmet used for corona virous tracing in dubai
  • దుబాయ్‌ పోలీసులు, రవాణా రంగ ఉద్యోగులకు సరఫరా
  • ప్రయాణికులు, పాదచారులకు థర్మల్‌ స్క్రీనింగ్‌
  • వారి శరీర ఉష్ణోగ్రతలు ఇట్టే తెలిసిపోతాయి
కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడం, బాధితుల గుర్తింపు కోసం దుబాయ్‌లో స్మార్ట్‌ హెల్మెట్‌ వినియోగిస్తున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ హెల్మెట్లను అక్కడి పోలీసులకు, రవాణా శాఖ ఉద్యోగులకు ప్రభుత్వం సరఫరా చేసింది. ఇందులో పరారుణ కాంతి కెమెరా, కృత్రిమ మేధస్సు, ముఖ గుర్తింపు సాంకేతిక పరికరాలను అమర్చారు. దీనివల్ల వీటిని పెట్టుకున్న ఉద్యోగి ముందు నుంచి వెళ్లే పాదచారులు, వాహన చోదకులను హెల్మెట్‌లోని థర్మల్‌ స్క్రీనింగ్‌ పరికరం స్కాన్‌ చేస్తుంది.

వారి శరీర ఉష్ణోగ్రతల్లో తేడాలను వారికి తెలియకుండానే గుర్తిస్తుంది. ఆ విధంగా బాధితులెవరైనా తమ ముందు నుంచి వెళ్లినట్టయితే తక్షణం వారిని పట్టుకుని క్వారంటైన్‌ కేంద్రాలకు తరలిస్తున్నారు. దీనివల్ల బాధితుల నుంచి వారికి తెలియకుండానే ఇతరులకు వైరస్‌ వ్యాప్తి జరగకుండా కట్టడి చేయవచ్చునన్నది అక్కడి ప్రభుత్వ ఉద్దేశం.
Dubhai
smart helmet
police
transport

More Telugu News