Nagarjuna: ఆ సమయంలో నాగ్ సార్ ధైర్యం చెప్పారు: రాహుల్ రవీంద్రన్

Manmathudu 2 Movie
  • 'మన్మథుడు 2' ఫ్లాప్ కుంగదీసింది
  • కొందరు వ్యక్తిగత విమర్శలు చేశారు
  •  నాగ్ సార్ సపోర్టును మరిచిపోలేనన్న రాహుల్
నటుడిగా రాహుల్ రవీంద్రన్ కి మంచి గుర్తింపు వుంది. ఇక దర్శకుడిగా ఆయన 'మన్మథుడు 2' చేశాడు. ఆ సినిమా పరాజయం పాలైన దగ్గర నుంచి రాహుల్ రవీంద్రన్ పేరు ఎక్కడా వినిపించలేదు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. 'మన్మథుడు 2' పరాజయంపాలు కావడం మానసికంగా నన్ను బాగా కుంగదీసింది. సినిమా విడుదల తరువాత వ్యక్తిగతంగా కొంతమంది చేసిన విమర్శలతో నేను డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను.

ఆ సినిమా విడుదలైన తరువాత నాకు నాగార్జున గారు కాల్ చేశారు. 'నువ్ చేసిన ప్రయత్నం మంచిదే .. అయితే అది కొన్ని సార్లు ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు. అంతమాత్రాన కుంగిపోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఎంతవరకు చేయాలో అంతవరకూ చేశావు .. ఇక ఫలితాన్ని గురించిన ఆలోచన వదిలేయి' అంటూ నాకు ధైర్యం చెప్పారు. ఆయన ఇచ్చిన సపోర్టును నేను ఎప్పటికీ మరచిపోను' అని చెప్పుకొచ్చాడు.
Nagarjuna
Rahul Ravindran
Manmathudu 2 Movie

More Telugu News