Hyderabad: పీఎఫ్ ఉపసంహరణకు వేతన జీవుల క్యూ.. 50 వేల దరఖాస్తులు

Over 50 thousand applications for withdraw PF

  • పీఎఫ్ ఖాతా నుంచి 75 శాతం తీసుకునే వెసులుబాటు కల్పించిన కేంద్రం
  • ఇందుకు అనుగుణంగా ఈపీఎఫ్‌వో చట్టంలో మార్పులు
  • మూడు రోజుల్లోనే పరిష్కరిస్తున్న అధికారులు

కరోనా వైరస్ నేపథ్యంలో ఉద్యోగులు, కార్మికులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన కేంద్రం పీఎఫ్ ఖాతాల నుంచి  కొంత సొమ్మును ఉపసంహరించుకునే వెసులుబాటు కల్పించింది. ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతాల నుంచి 75 శాతం లేదంటే, మూడు నెలల మూల వేతనం.. ఈ రెండింటిలో ఏది తక్కువైతే దానిని తీసుకోవచ్చని ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా ఈపీఎఫ్‌వో చట్టంలో మార్పులు చేసింది.

ప్రస్తుతం వేతనాలు సరిగా అందక, లాక్‌డౌన్ నేపథ్యంలో పనులు లేక ఇబ్బంది పడుతున్న వారు ఈ అవకాశాన్ని పెద్ద ఎత్తున వినియోగించుకుంటున్నారు. 50 వేల మందికిపైగా పీఎఫ్ ఉపసంహరణ కోసం దరఖాస్తు చేసుకున్నట్టు హైదరాబాద్‌లోని ఈపీఎఫ్‌వో వర్గాలు తెలిపాయి. తెలంగాణ రీజియన్ పరిధిలో వచ్చిన దరఖాస్తులను మూడు నుంచి ఏడు రోజుల్లోనే పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఈపీఎఫ్‌వో అధికారులు.. తెలంగాణ పరిధిలో మూడు రోజుల్లోనే పరిష్కరించినట్టు వివరించారు.

  • Loading...

More Telugu News