Apache: అత్యంత శక్తిమంతమైన హెలికాప్టర్ కూ తప్పని సాంకేతికలోపం... పంజాబ్ లో 'అపాచీ' ఎమర్జెన్సీ ల్యాండింగ్

Apache helicopter lands in village of Punjab

  • అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ తయారీ  
  • గాల్లోకి ఎగిసిన కాసేపటికే సాంకేతిక లోపం
  • ప్రమాద హెచ్చరికలు జారీచేసిన హెలికాప్టర్ రక్షణ వ్యవస్థలు

ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైన పోరాట హెలికాప్టర్ గా అపాచీ హెలికాప్టర్ కు ఎంతో పేరుంది. అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ తయారుచేసిన ఈ అపాచీ హెలికాప్టర్లను భారత్ కూడా కొనుగోలు చేసింది. అయితే, వాటిలో ఓ హెలికాప్టర్ కు అంతలోనే సాంకేతిక లోపం తలెత్తడం భారత వాయుసేన వర్గాలను నిరాశకు గురిచేసింది.

ఐఏఎఫ్ కు చెందిన అపాచీ ఏహెచ్-64 హెలికాప్టర్ గాల్లోకి ఎగిసిన తర్వాత సాంకేతిక లోపం తలెత్తడంతో పంజాబ్ లోని హోషియార్ పూర్ జిల్లాలో ఓ గ్రామంలో అత్యవసరంగా కిందికి దిగింది. ప్రమాదాన్ని ముందుగానే గుర్తించడంతో ఇద్దరు పైలెట్లు సురక్షితంగా బయటపడ్డారు. ఈ హెలికాప్టర్ పఠాన్ కోట్ ఎయిర్ బేస్ నుంచి పయనమైంది. కొద్దిసేపటికే హెలికాప్టర్ లోని వ్యవస్థలు ప్రమాద హెచ్చరికలు జారీచేయడంతో పైలెట్లు ఓ గ్రామంలో దింపాల్సి వచ్చింది.

అమెరికా నుంచి 22 అపాచీ హెలికాప్టర్ల కోసం భారత్ వంద కోట్ల డాలర్ల భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇటీవలే తొలి విడతగా కొన్ని హెలికాప్టర్లను భారత్ స్వీకరించింది.

  • Loading...

More Telugu News