Work from Home: వర్క్ ఫ్రమ్ హోమ్ తో కంపెనీలకు 'హ్యాకింగ్' మరిన్ని కష్టాలు!

Rise In Hacking Against Firms Amid Work From Home
  • రిమోట్ సిస్టంలను హ్యాక్ చేయడం ఈజీ
  • వారంలో 148 శాతం పెరిగిన రాన్సమ్ వేర్ దాడులు
  • లాక్ డౌన్ తో కంపెనీలకు పెరిగిన కష్టాలు
కరోనా నేపథ్యంలో ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు లాక్ డౌన్ ను కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, అమెరికా సహా పలు దేశాల్లోని కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని కల్పించారు. అసలే లాక్ డౌన్ తో ఇబ్బంది పడుతున్న కంపెనీలకు... ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సరికొత్త కష్టాలను తీసుకొచ్చింది. వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా ఉద్యోగులు వాడుతున్న కంప్యూటర్లు, లాప్ టాప్ లలో సెక్యూరిటీ తగ్గడంతో... సైబర్ క్రైమ్ కు పాల్పడేవారు దీన్ని అవకాశంగా మలుచుకుంటున్నారు.

ఇళ్ల నుంచి కనెక్ట్ అయిన కంప్యూటర్ల నుంచి డేటా చోరీకి గురవుతోందని నిపుణులు గుర్తించారు. ఈ వారంలో రాన్సమ్ వేర్ దాడులు ఏకంగా 148 శాతం పెరిగాయని సాఫ్ట్ వేర్ అండ్ సెక్యూరిటీ  కంపెనీ అయిన వీఎంవేర్ తెలిపింది. కరోనా మహమ్మారి పంజా విసురుతున్న సమయంలో... సైబర్ క్రైమ్ మహమ్మారి కూడా విజృంభిస్తోందని చెప్పింది. కార్పొరేట్ కార్యాలయంలోని సిస్టంను హ్యాక్ చేయడం కంటే రిమోట్ యూజర్ సిస్టంను హ్యాక్ చేయడం ఈజీ అని తెలిపింది.
Work from Home
Hacking
Corona Virus

More Telugu News