Corona Virus: కరోనా నేపథ్యంలో.. టర్కీలో కొత్త విధానం.. వయసుల వారీగా ఆంక్షలు!

sudden curfew and age specific restrictions inTurkey

  • కరోనా కట్టడికి టర్కీ నిర్ణయాలు
  • వారాంతంలో పూర్తిగా కర్ఫ్యూ విధింపు
  • మిగతా రోజుల్లో 20  నుంచి 60 మధ్య వయసు వాళ్లకు అనుమతి

పర్యాటక కేంద్రాలకు ప్రసిద్ధిగాంచిన టర్కీ దేశం కరోనా వైరస్ ధాటికి అల్లాడుతోంది. ఎప్పుడూ పర్యాటకులతో కళకళలాడే అనేక టూరిస్ట్ స్పాట్లు ఇప్పుడు జన సంచారమే లేక వెలవెలబోతున్నాయి. టర్కీలో ఇప్పటికే 78 వేల మందికి వైరస్ సోకగా.. 17 వందల పైచిలుకు మరణాలు సంభవించాయి. కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా టర్కీ ప్రభుత్వం అనేక ఆంక్షలు విధిస్తోంది. అనూహ్య, ఆకస్మిక నిర్ణయాలు తీసుకుంటోంది.

లాక్‌డౌన్, కర్ఫ్యూ ఆంక్షలపై ఆ దేశం భిన్నమైన నిర్ణయాలు తీసుకుంటోంది. వయసుల వారీగా ఆంక్షలు విధిస్తోంది. వారాంతం మినహా మిగతా రోజుల్లో 20 ఏళ్ల లోపువాళ్లు, 60 ఏళ్లు దాటినవాళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ  బయటకు రావద్దని ఆదేశించింది.  20 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్నవాళ్లు బయటకు వెళ్లొచ్చని సూచించింది.

నిర్మాణ రంగం, పరిశ్రమలకు ప్రభుత్వం అనుమతించింది.  బ్యాంకులు కొన్ని గంటలు పని చేసేందుకు వీలు కల్పించింది. చిన్న వ్యాపార సంస్థలను మూసివేయాలని ఆదేశించింది. రెస్టారెంట్లు తెరిచే ఉన్నప్పటికీ.. హోమ్ డెలివరీలు, పికప్ ఆర్డర్లకే అనుమతి ఇచ్చింది.

  • Loading...

More Telugu News