Gas Cylender: ఇక మెయిన్ గేటు వద్దే గ్యాస్ సిలిండర్ డెలివరీ!

Gas Cylender Gate Delivery in Telugu States

  • సిలిండర్ల పంపిణీ విధానంలో మార్పులు
  • ప్రభుత్వాల నుంచి గ్యాస్ కంపెనీలకు ఆదేశాలు
  • ప్రజలు, సిబ్బంది రక్షణ కోసమేనన్న ఐఓసీ

కరోనా మహమ్మారి విజృంభించిన వేళ, వంట గ్యాస్ సిలిండర్ల పంపిణీ డెలివరీ విధానంలో మార్పు చేసినట్టు గ్యాస్‌ సరఫరా సంస్థలు వెల్లడించాయి. ఇకపై డెలివరీ బాయ్స్‌ నేరుగా ఇళ్లలోకి వెళ్లి సిలిండర్‌ ఇవ్వబోరని, వారు గేట్ డెలివరీ మాత్రమే చేస్తారని, ఆంధ్రప్రదేశ్‌ , తెలంగాణ వంట గ్యాస్‌ డీలర్ల అసోసియేషన్‌ ప్రకటించింది. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి గ్యాస్‌ కంపెనీలకు ఆదేశాలు అందాయి.

ప్రజలు, గ్యాస్ సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది రక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని, భౌతిక దూరం పాటిస్తూ, స్టెరిలైజ్డ్‌ గ్లౌజులు, మాస్కులు ధరించి సిలిండర్లను డెలివరీ చేస్తామని, వాహనాల స్టెరిలైజేషన్ కోసం రసాయనాలు పిచికారీ చేయిస్తున్నట్టు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఐఓసీ హెడ్‌ ఆర్‌ శ్రావణ్‌ రావు వెల్లడించారు.

  • Loading...

More Telugu News