Harsha Vardhan: ‘కరోనా’ వ్యాప్తి వేగం తగ్గుతోంది: కేంద్ర మంత్రి హర్షవర్ధన్
- 2 వారాల క్రితం కేసుల రెట్టింపునకు 6.2 రోజులు పట్టింది
- గత వారం రోజుల్లో అయితే 7.02 రోజులకు రెట్టింపయ్యాయి
- గత 3 రోజుల ప్రకారం కేసుల రెట్టింపునకు 9.7 రోజులు పడుతోంది
దేశంలో ‘కరోనా’ వ్యాప్తి వేగం ఇప్పుడిప్పుడే తగ్గుతోందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. రెండు వారాల క్రితం ‘కరోనా’ కేసులు రెట్టింపు అయ్యేందుకు 6.2 రోజులు పట్టిందని, గత వారం రోజుల్లో 7.02 రోజులకు ఈ కేసులు రెట్టింపయ్యాయని చెప్పారు. గత మూడు రోజుల ప్రకారం కేసుల రెట్టింపునకు 9.7 రోజులు పడుతోందని చెప్పారు.
వలసల కూలీలు రాష్ట్రం దాటి వెళ్లేందుకు అనుమతి లేదు: హోం శాఖ కార్యదర్శి
వలసల కూలీల విషయంలో కేంద్రం మరోసారి మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రం దాటి వెళ్లేందుకు అనుమతి లేదని స్పష్టం చేసింది. స్వరాష్ట్రంలో ఉన్న వారు మాత్రమే పని ప్రదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. అదే విధంగా క్యాంపుల్లో ఉన్న వలస కూలీల వివరాలను, వారు చేసే పని వివరాలను నమోదు చేయాలని సూచించింది. అవసరమైతే క్యాంపు సమీపంలోనే పనులు ఉంటే వారితో చేయించుకోవాలని,ఆహార, రవాణా సౌకర్యం కల్పించి పనులు కల్పించవచ్చని సూచించింది. కూలీలు సామాజిక దూరం పాటించేలా చూస్తూ పనులు చేయించుకోవచ్చని సూచిస్తూ రాష్ట్రాలకు హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా లేఖ రాశారు.