Pensions: 'పెన్షన్లలో కోత' పుకార్లపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

Central Governmenmt clarifies pension reduction rumors
  • పెన్షన్లు తగ్గిస్తున్నారంటూ ఊహాగానాలు
  • అదేం లేదన్న కేంద్రం
  • పెన్షన్ దారుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నట్టు వెల్లడి
కరోనా ఉపద్రవం నేపథ్యంలో పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పెన్షన్లలో కోత విధించే ప్రతిపాదన ఏదీ తమ వద్ద లేదని కేంద్రం స్పష్టం చేసింది. పెన్షన్లను తగ్గించాలన్న ఆలోచన చేయడంలేదని, ఈ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని వెల్లడించింది. కరోనా మహమ్మారి కారణంగా దేశం తీవ్ర నష్టాల్లో ఉందని, దాంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లను తగ్గించడమో, పెన్షన్లను నిలిపివేయడమో చేస్తారంటూ కొన్నిరోజులుగా పుకార్లు షికారు చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. "ఈ విషయం డిపార్ట్ మెంట్ ఆఫ్ పెన్షన్స్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ (డీఓపీపీడబ్ల్యూ) దృష్టికి వచ్చింది. పెన్షన్లలో కోత ఉంటుందని, పెన్షన్లను నిలిపివేయవచ్చని పెన్షన్ దారుల్లో సందేహాలు నెలకొన్నాయి. అయితే, పెన్షనర్లు నష్టపోయే చర్యలను కేంద్రం తీసుకోవడంలేదు. పెన్షనర్ల సంక్షేమానికి కేంద్ర ప్రబుత్వం కట్టుబడి ఉంది" అంటూ ఓ ప్రకటనలో పేర్కొంది.
Pensions
Reduction
Centre
Corona Virus
Lockdown

More Telugu News