UPSC: యూపీఎస్సీ ప్రిలిమ్స్ వాయిదా... కొత్త తేదీ మే 3 తర్వాత వెల్లడించనున్న కేంద్రం

UPSC Prelims new date will be announced after lock down

  • మే 31న ప్రిలిమ్స్
  • మే 3 వరకు దేశంలో లాక్ డౌన్
  • కరోనా ప్రభావంతో ప్రిలిమ్స్ మరొక రోజు నిర్వహించాలని నిర్ణయం

కరోనా ప్రభావం యూపీఎస్సీ పరీక్షలపైనా పడింది. దేశంలోని అత్యున్నత సర్వీసుగా పేరుగాంచిన ఐఏఎస్ అధికారుల ఎంపిక కోసం నిర్దేశించిన యూపీఎస్సీ ప్రిలిమ్స్-2020 వాయిదా పడింది. ఈ పరీక్షలు వాస్తవానికి మే 31న జరగాల్సి ఉంది. కరోనా కారణంగా మే 3 వరకు లాక్ డౌన్ విధించారు. దాంతో ఈ పరీక్ష నిర్వహణను కొంతకాలం వాయిదా వేయాలని కేంద్రం భావిస్తోంది. మే 3 తర్వాత యూపీఎస్సీ ప్రిలిమ్స్ కొత్త తేదీలను ప్రకటిస్తామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News