Covid Worriers: కరోనా మహమ్మారిపై పోరాటానికి 'కొవిడ్ వారియర్స్' డేటా బేస్!

Government started Covid Worriers Database

  • రాష్ట్రాలకు సహకరించేందుకు ప్రత్యేక డేటాబేస్
  • వారి సేవలను వాడుకోవచ్చని కేంద్రం వెల్లడి
  • రెండు డిజిటల్ ప్లాట్ ఫామ్ ల ఏర్పాటు

కరోనాపై చేస్తున్న పోరాటంలో రాప్ట్ర ప్రభుత్వాలకు సహకరించేందుకు కేంద్ర ప్రభుత్వం 'కొవిడ్ వారియర్స్'ను ఏర్పాటు చేసింది. ఇది ఓ ప్రత్యేక డేటాబేస్‌. ఇందులో ఆయుష్‌ వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలు, ఎన్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు, నెహ్రూ యువకేంద్ర సభ్యులు, మాజీ సైనికులు, ఎన్‌సీసీ సభ్యులు, ప్రధానమంత్రి కౌషల్‌ వికాస్‌ యోజన సభ్యుల వివరాలన్నీ ఉంటాయి. వీరి సేవలను ఎప్పుడు కావాలంటే అప్పుడు వినియోగించుకోవచ్చు.

రేషన్‌ దుకాణాలు, కూరగాయల మార్కెట్లు, బ్యాంకులు తదితర ప్రజల దైనందిన అవసరాలు తీర్చే చోట, భౌతిక దూరాన్ని పాటించేలా చూసేందుకు, వయో వృద్ధులు, దివ్యాంగులు, అనాథలకు సాయపడేందుకు కొవిడ్ వారియర్స్ ను వినియోగించుకోవచ్చని కేంద్రం వెల్లడించింది. 'కొవిడ్ వారియర్స్ డాట్ గవ్ డాట్ ఇన్' (https://covidwarriors.gov.in) వెబ్‌ సైట్‌ లో వీరి సమాచారం ఉంటుందని కేంద్రం పేర్కొంది. ఇక డాక్టర్లు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, టెక్నికల్ సిబ్బంది, స్వచ్ఛంద సేవలకు శిక్షణ నిమిత్తం 'ఐగాట్ డాట్ గవ్ డాట్ ఇన్ స్లాష్ ఐగాట్' (https://igot.gov.in/igot) పేరిట మరో డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్‌ ను కూడా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

  • Loading...

More Telugu News