Yogi Adityanath: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తండ్రి పరిస్థితి విషమం

Yogi Adityanath Father Anand bisht health in critical condition
  • కాలేయం, మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్న ఆనంద్ సింగ్
  • గత నెల 13న ఎయిమ్స్‌లో చేరిక
  • 1991లో ఫారెస్ట్ రేంజర్‌గా పదవీ విరమణ
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ బిష్ట్ (89) ఆరోగ్యం విషమంగా ఉంది. కాలేయం, మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న ఆయన గత నెల 13న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. ఆయనకు ఆసుపత్రి గ్యాస్ట్రో విభాగానికి చెందిన డాక్టర్ వినీత్ అహుజా బృందం చికిత్స అందిస్తోంది.

ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై ఉన్నట్టు వైద్యులు తెలిపారు. నిన్న ఆయనకు డయాలసిస్ నిర్వహించినట్టు చెప్పారు.1991లో ఉత్తరాఖండ్‌లో ఫారెస్ట్ రేంజర్‌గా పదవీ విరమణ చేసిన బిస్ట్ అప్పటి నుంచి ఉత్తరాఖండ్‌, యమకేశ్వర్‌లోని పంచూర్ గ్రామంలో నివసిస్తున్నారు.

కాగా,  ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని ఎయిమ్స్ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు, ఇన్ఫర్మేషన్ డైరెక్టర్ షిషీర్ సింగ్ మాట్లాడుతూ ఆనంద్ సింగ్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌పై ఉన్నారని చెప్పారు.
Yogi Adityanath
Anand singh bisht
Delhi
AIIMS

More Telugu News