Corona Virus: కరోనా వైద్య పరికరాలను జీఎస్టీ నుంచి మినహాయించాలి: రేవంత్ రెడ్డి
- ఇప్పటికీ 12 నుంచి 18 శాతం జీఎస్టీ విధించడం బాధాకరం
- ‘జీఎస్టీ ఫ్రీ కరోనా’కు మద్దతు పలుకుతున్నా
- ట్విట్టర్ వేదికగా వెల్లడించిన ఎంపీ
కరోనా వైరస్ చికిత్సలో వాడే అత్యవసర వైద్య పరికరాలు, ఉపకరణాలను వస్తు సేవల పన్ను (జీఎస్టీ) నుంచి మినహాయించాలని మల్కాజ్‌గిరి ఎంపీ, కాంగెస్ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. వీటిపై ఇప్పటికీ 12 నుంచి 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తుండడం షాకింగ్‌గా ఉందని ఆయన అన్నారు. కరోనా వైద్య పరికరాలను జీఎస్జీ నుంచి తప్పించాలన్న డిమాండ్‌కు మద్దతు తెలుపుతున్నట్టు ఈ రోజు ట్వీట్ చేశారు. ఇండియన్ యూత్ కాంగ్రెస్ చేపట్టిన ‘జీఎస్టీ ఫ్రీ కరోనా’ ప్రచారానికి రేవంత్ మద్దతు ప్రకటించారు.