Sensex: నష్టపోయిన బ్యాంకింగ్ షేర్లు.. ఫ్లాట్ గా ముగిసిన మార్కెట్లు
- తీవ్ర ఒడిదుడుకుల్లో కొనసాగిన మార్కెట్లు
- 59 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 5 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ ఉదయం నుంచి తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. లాభ నష్టాల్లో కొట్టుమిట్టాడుతూ చివరకు ఫ్లాట్ గా ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 59 పాయింట్లు లాభపడి 31,648కి పెరిగింది. నిఫ్టీ 5 పాయింట్ల నష్టంతో 9,261 వద్ద స్థిరపడింది. ఐటీ, ఎనర్జీ, టెక్ తదితర సూచీలు లాభపడగా... మెటల్, టెలికాం, ఆటో తదితర సూచీలు నష్టపోయాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (3.91%), ఇన్ఫోసిస్ (3.75%), సన్ ఫార్మా (3.59%), ఎన్టీపీసీ (3.35%), హెచ్సీఎల్ (3.26%).
టాప్ లూజర్స్:
యాక్సిస్ బ్యాంక్ (-5.10%), ఐటీసీ (-3.91%), ఐసీఐసీఐ బ్యాంక్ (-3.84%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.73%), మారుతి సుజుకి (-3.33%).