Lockdown: కత్తెర పట్టి, మామకు హెయిర్ కట్ చేసిన కర్నూలు కోడలు.. వీడియో!

Hair Cut to Father in Law

  • లాక్ డౌన్ కారణంగా మూతపడ్డ సెలూన్లు
  • తప్పనిసరి పరిస్థితుల్లో కత్తెర పట్టానన్న జయమ్మ
  • మామకు స్వయంగా క్షవరం

లాక్ డౌన్ ప్రభావం హెయిర్ కటింగ్ సెలూన్లపైనా పడగా, నెల రోజులుగా అన్ని సెలూన్లూ మూతబడే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల నుంచి సామాన్యుల వరకూ తమ పిల్లలకు హెయిర్ కటింగ్ చేసేందుకు స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. తాజాగా, కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన జయమ్మ అనే మహిళ, తన మామయ్య కోసం కత్తెర అందుకుంది. ఓ కుర్చీలో కూర్చోబెట్టి క్షవరం చేసింది. సెలూన్లన్నీ మూతపడటం వల్లే తాను ఈ పని చేయాల్సి వచ్చిందని ఆమె వెల్లడించింది. జయమ్మ కత్తెర పట్టుకున్న వీడియోను మీరూ చూడవచ్చు. 

  • Loading...

More Telugu News