Kanna Lakshminarayana: విజయసాయిరెడ్డిపై పరువునష్టం దావా వేస్తా: కన్నా లక్ష్మీనారాయణ
- ఎన్నికల్లో డబ్బులు పంచే సిద్ధాంతం మా పార్టీలో ఉండదు
- ప్రమాణాలు చేయడం విజయసాయిరెడ్డికి అలవాటే
- కోర్టులో భగవద్గీతపై కూడా ఆయన ప్రమాణం చేశారు
ఏపీలో ‘కరోనా’ కమ్యూనిటీ స్ప్రెడ్ పరిస్థితి రావడానికి కారణం వైసీపీ శాసనసభ్యులు, మంత్రులేనని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. వైసీపీ నేతలు విచ్చలవిడిగా బజార్లలో తిరగడం వలన ‘కరోనా’ వ్యాప్తి చెందే పరిస్థితి నెలకొందని విమర్శించారు. బీజేపీ ఫండ్స్ గురించి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడారని, ఎన్నికల్లో డబ్బులు పంచే సిద్ధాంతం తమ పార్టీలో ఉండదని, ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డా నేతృత్వంలో అవినీతికి ఆస్కారం లేదని స్పష్టం చేశారు.
చంద్రబాబు నుంచి రూ.20 కోట్లు తీసుకున్నానన్న విజయసాయిరెడ్డి ఆరోపణలపై పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ప్రమాణాలు చేయడం విజయసాయిరెడ్డికి అలవాటేనని, కోర్టులో భగవద్గీతపై కూడా ఆయన ప్రమాణం చేసి ఏం చెబుతున్నారో ప్రజలకు తెలుసని కన్నా వ్యంగ్యంగా అన్నారు.