Lockdown: ఆర్బీఐ నుంచి రూ. 2 వేల కోట్ల రుణం తీసుకున్న తెలంగాణ సర్కారు!
- లాక్ డౌన్ వేళ ప్రభుత్వానికి తగ్గిన ఆదాయం
- స్టేట్ డెవలప్ మెంట్ లోన్ కింద రూ. 2 వేల కోట్ల రుణం
- ఈ నెలలో ఆర్బీఐ నుంచి ఇప్పటికే రూ. 4 వేల కోట్ల అప్పు
కరోనాను కట్టడి చేయాలన్న ఉద్దేశంతో లాక్ డౌన్ ను అమలు చేస్తున్న వేళ, ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోగా, నిధుల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి తెలంగాణ సర్కారు రూ. 2 వేల కోట్ల రుణాన్ని తీసుకుంది. ఎస్డీఎల్ (స్టేట్ డెవలప్ మెంట్ లోన్) కింద బాండ్ల విక్రయం, సెక్యూరిటీల ద్వారా ఈ రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొందింది.
ఈ రుణంలో రూ. 1000 కోట్లను 2026 నాటికి, మిగతా మొత్తాన్ని 2028 నాటికి తిరిగి చెల్లించాల్సి వుంటుంది. కాగా, ఈ నెల 13న కూడా ప్రభుత్వం రూ. 2 వేల కోట్లను రుణంగా తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో 10 రోజుల వ్యవధిలోనే ప్రభుత్వం రూ. 4 వేల కోట్ల రుణాన్ని తీసుకున్నట్లయింది.