Narendra Modi: కరోనా నియంత్రణ చర్యల నిర్వహణలో టాప్ లో మోదీ... దిగువన ట్రంప్!

Modi in Top Corona Handling Ranks for World Leaders
  • ర్యాంకింగ్స్ ప్రకటించిన  'మార్నింగ్ కన్సల్ట్' 
  • 63 పాయింట్లతో మోదీ అగ్రస్థానం
  • ఆపై లోపేజ్, జాన్సన్, మోరిస్
కరోనా నియంత్రణ చర్యలను పక్కాగా చేపట్టడంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, ప్రపంచ దేశాల అధినేతలకు ఎవరికీ అందనంత ఎత్తున నిలిచారు. వీడీపీ అసోసియేట్స్ ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా పోలింగ్ సేవలను అందిస్తున్న 'మార్నింగ్ కన్సల్ట్' తాజాగా నిర్వహించిన సర్వే తరువాత, ప్రపంచ ప్రధానులు, అధ్యక్షుల ర్యాంకులను ప్రకటించిందని పేర్కొంది.

ఈ ర్యాంకుల ప్రకారం ప్రధాని నరేంద్ర మోదీ 68 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచారు. మెక్సికో అధ్యక్షుడు లోపేజ్ కు 36, యూకే ప్రధాని జాన్సన్ కు 35, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిజన్ కు 26 పాయింట్లు దక్కాయి. ఇక, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మైనస్ 3 పాయింట్లు లభించాయి.

ఈ జాబితాలో కెనడా ప్రధాని ట్రుడావ్ 21, జర్మనీ చాన్సెలర్ ఏంజిలా మెర్కెల్ 16, బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారా 8 పాయింట్లతో ఉండగా, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మేక్రాన్ మైనస్ 21, జపాన్ ప్రధాని షింజో అబే మైనస్ 33 పాయింట్లతో ఉన్నారు.
Narendra Modi
Rankings
Corona Virus
Handling

More Telugu News