Tablighi Jamaat: కరోనా నుంచి బయటపడిన వారంతా ప్లాస్మా డొనేట్ చేయండి: తబ్లిగీ జమాత్ చీఫ్
- ప్లాస్మా డొనేట్ చేసి ఇతరులకు సహాయపడండి
- క్వారంటైన్ లో ఉన్నవారిలో అధికులకు ఇన్ఫెక్షన్ లేదు
- రంజాన్ మాసంలో ముస్లింలు ఇంటి వద్దే ప్రార్థనలు చేసుకోవాలి
కరోనా మహమ్మారి విస్తరణకు కారణమయ్యారనే ఆరోపణలతో పోలీసు కేసులను ఎదుర్కొంటున్న ఢిల్లీ తబ్లిగీ జమాత్ చీఫ్ మౌలానా సాద్ ఖందాల్వీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్వారంటైన్ లో ఉన్న వారిలో అధికులకు ఇన్ఫెక్షన్ లేదని... పరీక్షల్లో వారికి నెగెటివ్ వస్తోందని ఆయన అన్నారు. పాజిటివ్ నిర్ధారణ అయిన వారు కూడా చికిత్స పొందిన తర్వాత మహమ్మారి నుంచి బయటపడ్డారని చెప్పారు. తనతో పాటు మరికొందరు క్వారంటైన్ లోనే ఉన్నామని తెలిపారు.
కరోనా నుంచి బయటపడిన వారికి తాను ఒక విన్నపం చేస్తున్నానని... వారంతా తమ బ్లడ్ ప్లాస్మాను ఇతరులకు డొనేట్ చేయాలని ఖందాల్వీ కోరారు. కరోనాతో పోరాడుతూ, ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారికి సహాయపడాలని విన్నవించారు.
రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలంతా ఇంటి వద్దనే ఉంటూ ప్రార్థనలు చేసుకోవాలని ఖందాల్వీ పిలుపునిచ్చారు.