Air Ambulence: లాక్ డౌన్ లో తొలిసారి హైదరాబాద్ కు వచ్చిన ఎయిర్ అంబులెన్స్!

Air Ambulence from Afghanisthan to Hyderabad

  • ఆఫ్గన్ లో పని చేస్తున్న హైదరాబాద్ నివాసి
  • రోడ్డు ప్రమాదంలో వెన్నెముకకు గాయాలు
  • ఎయిర్ అంబులెన్స్ కు అనుమతించిన అధికారులు

లాక్ డౌన్ నిబంధనలు అమలులోకి వచ్చిన తరువాత హైదరాబాద్ కు తొలిసారిగా ఎయిర్ అంబులెన్స్ వచ్చింది. అది కూడా ఆఫ్గనిస్థాన్ నుంచి. ఎయిర్ పోర్టు అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఉపాధి నిమిత్తం ఆఫ్గనిస్థాన్ కు వెళ్లిన ఓ హైదరాబాద్ వ్యక్తి ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తుండగా, రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆయన వెన్నెముకకు తీవ్రగాయమై, పరిస్థితి విషమించింది.

అతనికి అవసరమైన అత్యాధునిక వైద్యం ఆఫ్గన్ లో లభించే పరిస్థితి లేకపోవడంతో, ఐసీఏటీటీ హెల్త్‌ సొల్యూషన్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ ఆధ్వర్యంలోని ఎయిర్‌ అంబులెన్స్‌ లో హైదరాబాద్‌ కు తీసుకొచ్చేందుకు ప్రత్యేక అనుమతిని కోరగా, అధికారులు అంగీకరించారు. దీంతో అక్కడి డాక్టర్లు రాహుల్ సింగ్, శాలినీ నల్వాద్ లు బాధితుడిని వెంట తీసుకుని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఆపై రోడ్డు మార్గం ద్వారా ఓ ప్రైవేటు ఆసుపత్రికి బాధితుడిని తరలించారు.

  • Loading...

More Telugu News