Chiranjeevi: తప్పుగా మాట్లాడితే వారి నీచత్వమే బయటపడుతుంది: చిరంజీవి

Chiranjeebi responds on trolls

  • ట్రోలింగ్ అనేది నవ్వుకునేలా ఉండాలి
  • ట్రోల్స్ చూసి టైమ్ వేస్ట్ చేసుకోను
  • చేసుకునే వారిని చేసుకోనివ్వండి.. 

సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారనే విషయం తెలిసిందే. సామాజిక మాధ్యమాల్లో వారు చేసే ట్వీట్లకు పెద్ద ఎత్తున స్పందన వస్తుంటుంది. ఇదే సమయంలో ట్రోలింగ్ బాధ కూడా అదే స్థాయిలో ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవికి కూడా దీని బాధలు తప్పలేదు.

చిరంజీవి ఇటీవలే ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేశారు. రెగ్యులర్ గా ట్వీట్లు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఇదే సమయంలో కరోనా మహమ్మారి గురించి ప్రజల్లో అవగాహన తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో, చిరుపై నలువైపుల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది. అయితే, అడపాదడపా చిరంజీవిని ట్రోల్ చేస్తున్న వారు కూడా లేకపోలేదు. ఈ ట్రోలింగ్ పై ఓ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన స్పందించారు.

ట్రోలింగ్ అనేది నవ్వుకునేలా ఉంటే బాగుంటుందని... నవ్వుల పాలయ్యేలా ఉండకూడదని చిరంజీవి అన్నారు. తనకు కూడా ట్రోల్స్ వచ్చాయని... వాటిని చూసి టైమ్ వేస్ట్ చేసుకోనని చెప్పారు. అలాంటి వారి నీచ బుద్ధి మారదని... తప్పుగా మాట్లాడితే వారి నీచత్వమే బయటపడుతుందని అన్నారు. ట్రోల్ చేసుకునే వారిని చేసుకోనివ్వండని అన్నారు.  

  • Loading...

More Telugu News