Pakistan: స్వీయ నిర్బంధంలోకి పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్.. కరోనా పరీక్షలు

Pakistan PM Imran Khan goes into self isolation and undergoes COVID19 test

  • గతవారం  ప్రముఖ దాత ఫైసల్ ఎధిని కలిసిన ఇమ్రాన్ ఖాన్
  • ఎధికి కరోనా పాజిటివ్ అని తేలడంతో అప్రమత్తం
  • ప్రధాని నుంచి శాంపిళ్లు సేకరించిన వైద్యులు

గతవారం తాను కలిసిన ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్టు తేలడంతో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. అలాగే, కరోనా పరీక్షల నిమిత్తం ఆయన నుంచి వైద్యులు శాంపిళ్లు సేకరించారు. వాటి ఫలితాలు ఈ రోజే వచ్చే అవకాశం ఉందని ఇమ్రాన్ వ్యక్తిగత వైద్యుడు ఫైసల్ సుల్తాన్ తెలిపారు.

ఇమ్రాన్ ఈ నెల 15వ తేదీన ఇస్లామాబాద్‌లో  ప్రముఖ దాత, ఎధి ఫౌండేషన్ చైర్మన్ ఫైసల్ ఎధిని కలిశారు. ఈ సందర్భంగా ఎధి.. కరోనా వైరస్ సహాయ నిధి కోసం రూ. పది మిలియన్ రూపాయల చెక్‌ను ప్రధానికి అందజేశారు.

ఇక ఇమ్రాన్‌ను కలిసిన కొద్ది రోజులకే ఎధిలో వైరస్ లక్షణాలు కనిపించాయి. లక్షణాలు నాలుగు రోజుల పాటు ఉండడంతో ఆయనకు పరీక్షలు చేయగా.. కరోనా వైరస్ సోకినట్టు తేలింది. దాంతో, అప్రమత్తమైన ఇమ్రాన్‌ స్వీయ నిర్బంధంలోకి వెళ్లి.. పరీక్ష చేయించుకున్నారు. ఫలితాలు వచ్చిన తర్వాత ఇమ్రాన్‌ క్వారంటైన్‌లో ఉండాల్సి వస్తే ప్రభుత్వాన్ని ఆయన ఎలా నడిపిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది.

  • Loading...

More Telugu News