Chandrababu: కువైట్ వలస కార్మికుల జీవనోపాధికి చర్యలు తీసుకోండి.. కేంద్ర విదేశాంగ మంత్రికి చంద్రబాబు లేఖ

Chandrababau Naidu writes a letter to central minister Jai Shanker

  • కువైట్ లో పూర్తి స్థాయి లాక్ డౌన్ ప్రకటించారు
  • అక్కడ భారతీయ వలస కార్మికులు ఉపాధి కోల్పోయారు
  • వారిని ఇక్కడికి పంపేందుకు కువైట్ సిద్ధంగా ఉంది

కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం  జై శంకర్ కు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఓ లేఖ రాశారు. ‘కరోనా’ నేపథ్యంలో కువైట్ దేశంలో పూర్తి స్థాయి లాక్ డౌన్ ప్రకటించారని, దీంతో, అక్కడ ఉన్న మన దేశ వలస కార్మికులు
తమ ఉపాధి కోల్పోయారని పేర్కొన్నారు.

వలస కార్మికులను మన దేశానికి పంపించేందుకు కువైట్ సిద్ధంగా ఉందని, దాదాపు పదిహేను వేల మంది కార్మికులు ఇక్కడికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కువైట్ నుంచి తరలివచ్చే వలస కార్మికుల భద్రత, జీవనోపాధికి చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు. కువైట్ నుంచి భారత్ కు చేరిన తర్వాత వారిని వారి స్వస్థలాలకు పంపించేలా చూడాలని ఈ లేఖ ద్వారా చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News