Bill Gates: మోదీని ప్రశంసిస్తూ బిల్ గేట్స్ లేఖ!
- ‘కరోనా’ నియంత్రణకు ప్రభుత్వ చర్యలపై ప్రశంసలు
- మోదీని ప్రశంసిస్తూ లేఖ రాసిన బిల్ గేట్స్
- లాక్ డౌన్, హాట్ స్పాట్ కేంద్రాల గుర్తింపు.. వంటి చర్యలతో ప్రయోజనం
భారత్ లో ‘కరోనా’ నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీని అభినందిస్తూ ఓ లేఖ రాశారు. భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చేపట్టిన లాక్ డౌన్, హాట్ స్పాట్ కేంద్రాల గుర్తింపు, వైరస్ బారినపడ్డ వారిని ఐసోలేషన్ కేంద్రాలకు, అనుమానితులను క్వారంటైన్ లో ఉంచడం వంటి చర్యలు ఎంతగానో ఉపయోగపడ్డాయని అన్నారు. ఈ సందర్భంగా ‘కరోనా’ బాధితులకు వైద్యుల సేవలను, ’ఆరోగ్య సేతు’ వంటి యాప్ లను అందుబాటులోకి తేవడాన్ని ఆయన కొనియాడారు.