Savitha Kovind: నిరాశ్రయుల కోసం.. స్వయంగా మాస్క్ లను తయారు చేసిన భారత ప్రథమ మహిళ సవితా కోవింద్!

Savitha Kovind Made Masks for Poor
  • కుట్టుమిషన్ ఎక్కిన రామ్ నాథ్ కోవింద్ భార్య
  • ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్ మెంట్ బోర్డుకు మాస్క్ ల అందజేత
  • ప్రతి ఒక్కరూ కలసి కట్టుగా పోరాడాలని సందేశం
భారత ప్రథమ మహిళ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ భార్య సవితా కోవింద్, కరోనా నివారణకు తనవంతుగా, న్యూఢిల్లీలోని షెల్టర్ హోమ్స్ లో ఉన్న నిరాశ్రయులకు మాస్క్ లను తయారు చేసి అందించారు. రాష్ట్రపతి భవన్ లోని శక్తి హాత్ లో ఆమె స్వయంగా కుట్టుమిషన్ ఎక్కి మాస్క్ లను రూపొందించారు.

ఆపై వాటిని ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్ మెంట్ బోర్డుకు పంపించారు. తన చర్యల ద్వారా కరోనా పోరుకు ప్రతి ఒక్కరూ కలసి రావాలన్న సందేశాన్ని ఆమె సమాజానికి ఇచ్చారు. కాగా, మాస్క్ లను ధరించడం ద్వారా కరోనా వైరస్ శరీరంలోకి వెళ్లకుండా జాగ్రత్త పడవచ్చన్న సంగతి తెలిసిందే.
Savitha Kovind
Masks
Corona Virus
Rashtrapathi
Shakti Haat

More Telugu News