Corona Virus: కరోనా బాధితులకు ఆయుర్వేద చికిత్స.. క్లినికల్ ట్రయల్స్‌కు డాక్టర్ల రెడీ!
- ఫిఫట్రాల్ అనే ఔషధాన్ని తయారుచేసిన బీహెచ్‌యూ
- కొవిడ్-19 టాస్క్‌ఫోర్స్ నుంచి అనుమతుల కోసం ఎదురుచూపు
- డాక్టర్ కేఎన్ ద్వివేదీ నేతృత్వంలో కార్యాచరణ
కరోనా వైరస్‌కు విరుగుడు కనిపెట్టే పనిలో ప్రపంచం మొత్తం నిమగ్నమైంది. చైనా, అమెరికా వంటి దేశాలు ఇప్పటికే తయారుచేసిన ఔషధానికి క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నాయి. మరోవైపు, మన దేశం ఈ మహమ్మారిపైకి ఆయుర్వేద ఔషధాన్ని ప్రయోగించాలని యోచిస్తోంది. ఇందుకు సంబంధించి క్లినికల్ ట్రయల్స్‌కు వైద్యులు సిద్ధమవుతున్నారు.
‘ఫిఫట్రాల్’ అనే ఆయుర్వేద ఔషధాన్ని కరోనా పీడితులపై ప్రయోగించేందుకు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం (బీహెచ్‌యూ) సన్నద్ధమైంది. ప్రధాన పరిశోధకుడు అయిన డాక్టర్ కేఎన్ ద్వివేదీ నేతృత్వంలో ఓ కార్యాచరణను రూపొందించారు. కొవిడ్-19పై ఏర్పాటు చేసిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ నుంచి క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతులు వచ్చిన వెంటనే వైద్యులు ఈ చికిత్స ప్రారంభిస్తారు.