Varla Ramaiah: ఆంధ్రప్రదేశ్‌లో ఏదో జరుగుతోంది: టీడీపీ నేత వర్ల రామయ్య అనుమానం

valra ramaiah fires on ycp leaders

  • సీఎంకి అందవలసిన సమాచారం సరిగా అందట్లేదు
  • ఇంటెలిజెంట్, ముఖ్యమంత్రి కార్యాలయం సరిగా పని చేస్తున్నట్లు లేదు
  • వైసీపీ ఎమ్మెల్యేల మీద చర్యలేవీ?
  • అందుకే అంటున్నా.. ముఖ్యమంత్రిని చీకట్లో వుంచారని 

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాలపై, వైసీపీ నేతలపై టీడీపీ నేతలు విమర్శల జల్లు కురిపిస్తున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో వైసీపీ నేతలు నిబంధనలు ఉల్లంఘిస్తోంటే వారిపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని వారు ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కార్యాలయం సరిగా పని చేస్తున్నట్లు లేదని టీడీపీ నేత వర్ల రామయ్య అనుమానం వ్యక్తం చేశారు.

'రాష్ట్రంలో ఏదో జరుగుతోంది. ముఖ్యమంత్రి గారికి అందవలసిన సమాచారం సరిగా అందడం లేదు. ఇంటెలిజెంట్, ముఖ్యమంత్రి కార్యాలయం సరిగా పని చేస్తున్నట్లు లేదు. సరిగా పనిచేస్తే, విజయ సాయిరెడ్డి మీద, కాళహస్తి, కనిగిరి, నగరి ఎమ్మెల్యేల మీద చర్యలేవీ? అందుకే అంటున్నా, ముఖ్యమంత్రిని చీకట్లో వుంచారని' అంటూ వర్ల రామయ్య ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News